బొలెరో వాహనం, ఆటో ఢీకొన్న ఘటనపై ఉండి పోలీస్ స్టేషన్ లో శనివారం కేసు నమోదైంది. పరుచూరి గురునాథం తన ఆటోలో ప్యాసింజర్లతో భీమవరం నుంచి ఆకివీడు వెళ్తుండగా చెరుకువాడ గ్రామ శివారులో ఆకివీడు నుంచి వస్తున్న బొలేరో వాహనం ఢీకొట్టింది. గురునాధంతో పాటు, ఆటోలో ఉన్న మహిళకు గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఈ ఘటనపై ఎస్ఐ నసీరుల్లా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.