వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం "ముఖ్యమంత్రి సహాయ నిధి" నుండి మంజూరైన రూ. 17, 87, 236 సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆదివారం ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. 28 మంది లబ్ధిదారులకు అందజేసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు.