ఉండి: అధికారుల తీరుపై సీపీఎం నేతలు ఆగ్రహం

80చూసినవారు
సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య సైకిల్ యాత్ర శుక్రవారం ఉండి మండలం ఎన్ఆర్పి అగ్రహారానికి చేరుకుంది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి గోపాలన్ మాట్లాడారు. గ్రామంలో పారిశ్రామికవేత్త ప్రభుత్వ భూమిని ఆక్రమించి రహదారి లేకుండా చేశారని అన్నారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే మరియు అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్