ఉండి మండలంలో వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో సాక్షి విలేఖరి రత్నరాజు అధ్యక్షతన శుక్రవారం నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి, మరో ఆరుగురు పాత్రికేయులపై అక్రమంగా క్రిమినల్ కేసులు నమోదు చేయడం అక్రమమని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు, ఉండి మీడియా ప్రతినిధులు సంయుక్తంగా ఖండించారు. స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ లో పోలీస్ స్టేషన్ లో వినతి పత్రాలు అందజేశారు.