ఉండి 33/11 కేవీ ఉప కేంద్రానికి సంబంధించి ఆరేడు 11 కేవీ ఫీడర్ పై చెట్లకొమ్మలను తొలగిస్తున్నారు. మంగళవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఈఈ ఎన్. వెంకటేశ్వరరావు తెలిపారు. ఎన్నార్పీ అగ్రహారం, బీసీ కాలనీ, ఉండి- భీమవరం రహదారిలోని పారిశ్రామిక లైన్లు, మహదేవపట్నం పారిశ్రామిక లైన్ల పరిధిలో సరఫరా ఉండదన్నారు.