బుద్ధి ఉన్న వారెవరూ మాజీ సీఎం జగన్‌తో పని చేయలేరని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. ఎన్నికల తర్వాత ఆ పార్టీలో ఎవరూ ఉండరని గతంలోనే చెప్పాను. విజయసాయిరెడ్డి లాంటి వాళ్లే కాదు. చీము, నెత్తురు ఉన్నవాళ్లు ఆయన దగ్గర పని చేయలేరు. జగన్ ఒక యూనిక్ క్యారెక్టర్. అతను ఎవరినీ దగ్గర ఉంచుకోలేరు. ఆ పార్టీలో నంబర్-2 అంటే బయటకు వెళ్లడానికి రెడీ అయినట్లే. ఆ రెండో ప్లేస్ అనేది చాలా రిస్క్ అని చెప్పారు.