ఈనెల 21న వైజాగ్ సముద్రం ఒడ్డున ప్రపంచ స్థాయిలోనే నిలిచిపోయేలాగా ప్రణాళిక చేస్తున్నారని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు శనివారం తెలిపారు. 2 కోట్ల మంది యోగాకు రిజిస్టర్ అవుతారనుకుంటే, 2. 20 లక్షల మంది రిజిస్టర్ అయ్యారన్నారు. ప. గో. జిల్లాలో 8,50,000 మంది యోగా రిజిస్టర్ చేసుకున్నారని దేశంలోనే యోగా అంటే ఆంధ్రప్రదేశ్ గుర్తొచ్చేలాగా యోగాంధ్ర 2025ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.