ఆకివీడు నగర పంచాయతీలో గత కొన్ని రోజులుగా వోల్టేజ్ సమస్య తీవ్రంగా ఉంది. దీంతో ఓవర్ లోడ్ విద్యుత్ రావడంతో నగర పంచాయతీలోని పలు ప్రాంతాలలో విద్యుత్ ఉపకరణాలు ధ్వంసం అయ్యాయి. దీంతో విద్యుత్ శాఖకు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడంతో సుమారు 8 లక్షల నష్టం వాటిల్లునట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.