వానల కారణంగా ముంపుకు గురైన వరి వ్యవసాయ క్షేత్రాలు త్వరితగతిన కోలుకొనేందుకు రైతులు వ్యవసాయ శాఖ ఇస్తున్న సలహాలు, సూచనలు పాటించాలని వ్యవసాయ శాఖ భీమడోలు సహాయ సంచాలకులు పి. ఉషారాజకుమారి, వ్యవసాయ అధికారి ఉషారాణి తెలిపారు. మండలంలో ముంపుకు గురైన వ్యవసాయ క్షేత్రాలను వారిరువురు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మండలంలో గత రెండు రోజులుగా 200 ఎకరాల విస్తీర్ణానికి పైగా ముంపుకు గురైనట్టు గుర్తించామన్నారు.