వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా వైసీపీ పార్టీ కమిటీలో ఆయా నియోజకవర్గాలకు చెందిన నేతలకు పదవులు కేటాయించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో జిల్లా ఉపాధ్యక్షులుగా చేబోయిన వీర్రాజు (కైకలూరు), మేకా లక్ష్మణరావు (దెందులూరు), పల్లగాని నర్సింహరావు (నూజివీడు), అంబికా రాజా (ఏలూరు), పొత్తూరి శ్రీనివాసరాజు (ఉంగుటూరు) నియమితులయ్యారు.