భీమడోలు మండలం గుండుగొలను గ్రామానికి చెందిన సినీ, టీవీ నటుడు, ప్రజా నాట్యమండలి కళాకారుడు అల్లం గోపాలరావు(75) అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లో శనివారం మృతి చెందారు. అయన స్వగ్రామం గుండుగొలను. ఆయనకు భార్య విమల, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు అల్లం అనిల్ టీవీ సీరియల్స్, సినిమాల్లో నటించారు. గోపాల రావు మృతికి గ్రామంలోని ఆయన బంధువులు, సన్నిహితులు సంతాపం తెలిపారు.