సంక్రాంతి పండుగను గ్రామస్తులు సాంప్రదాయ ఆటలతో సంతోషాలతో జరుపుకోవాలని భీమడోలు మండలం పొలసానిపల్లి గ్రామ సర్పంచ్ రహీమ బేగం హసేన తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ అధ్యక్షతన కోడి పందేలు, జూద క్రీడల నిషేదంపై అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. కుటుంబంతో సంతోషంగా సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలని ఆమె సూచించారు.