భీమడోలు: కట్నం వేధింపులపై ఫిర్యాదు

85చూసినవారు
భీమడోలు: కట్నం వేధింపులపై ఫిర్యాదు
అదనపు కట్నం కోసం భర్త వేధిస్తున్నాడని ఓ మహిళ గురువారం భీమడోలు పోలీసులను ఆశ్రయించింది. భీమడోలు మండలం అంబారుపేటకు చెందిన సుస్మిత, ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడుకు చెందిన లూర్ధూ రాజుకు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారన్నారు. భర్త చెడు వ్యసనాలకు బానిసై కట్నం కోసం వేధిస్తున్నాడని సుస్మిత వాపోయారు. అతనికి తన అత్తమామలు వత్తాసు పలుకుతున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్