భీమడోలు మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ రామయ్య అధ్యక్షతన మంగళవారం జరిగింది. వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని ప్రజాతినిధులు సమావేశంలో మాట్లాడారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఆయా శాఖల అధికారులు వివరించారు. సమావేశంలో జడ్పీటీసి తుమ్మగుంట భవానీ రంగా, ఎంపీడీవో పద్మావతిదేవి మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.