భీమడోలు: వంతెన నిర్మాణంపై రైతుల ఆందోళన

55చూసినవారు
భీమడోలు మండలం గుండుగోలను వద్ద ఏలూరు కాలువపై వంతెన నిర్మాణ పనులకు తూరలు ఏర్పాటు చేయడాన్ని దెందులూరు రైతులు శుక్రవారం అభ్యంతర వ్యక్తం చేశారు. కాలువలో త్వరలో ఏర్పాటు చేయడం వలన రబీలో సాగునీటి ఇబ్బందులు తలెత్తుతాయని ప్రస్తుతానికి తూరలు ఏర్పాటు చేసే పనులను నిలుపుదల చేయాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దెందులూరు మండలం పోతునూరు, దోసపాడు, కొవ్వలి, దెందులూరు, ఏలూరు గ్రామీణ మండలం మల్కాపురం రైతులు తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్