భీమడోలు మండలం గుండుగొలను గ్రామ జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు విజయకేతనం 2024-25 స్టడీ మెటీరియల్ ను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మ శ్రీ ప్రసాద్ శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. పదో తరగతి పరీక్షలను ప్రతి ఒక్క విద్యార్థి ఛాలెంజ్ గా తీసుకొని కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.