ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పల్లెల్లో సంక్రాంతి పండుగ ముందే వచ్చిందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. భీమడోలు మండలం గుండుగొలనులో రూ. 25 లక్షలు, భీమడోలులో రూ. 90 లక్షల నిధులతో చేపట్టిన సిమెంటు రహదారులు, వడ్డిగూడెంలో రూ. 2. 30 లక్షలతో నిర్మించిన గోకులం షెడ్డును ఎమ్మెల్యే ధర్మరాజుతో కలిసి ఎంపీ శనివారం ప్రారంభించారు.