పొలసానిపల్లి గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉండే ప్రాంతాతనికి పంచాయతీ కార్యాలయాన్ని మార్చినట్లు సర్పంచ్ షేక్ రహీమా బేగం హసేన అన్నారు. రూ. 23 లక్షల ఉపాధి హామీ, గ్రామపంచాయతీ నిధులతో నిర్మించిన నూతన భవనాన్ని సర్పంచ్ మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పత్తి మదన్, గంజి సుబ్బారావు, గోవింద్, ప్రవీణ్ పటేల్, పి. సత్యనారాయణ, గ్రామపంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.