ఆదివారం ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు భీమడోలు, గుండుగోలను, అగడాలంక, అంబర్పేట సబ్‌స్టేషన్ పరిధిలో కరెంట్ ఉండదని ఈఈ అంబేడ్కర్ తెలిపారు. మొక్కలు కటింగ్, సబ్‌స్టేషన్ మరమ్మతుల నిమిత్తంగా ఈ పవర్ కట్ ఉంటుందన్నారు. గుండుగోలను, నాగహనుమాను ఇండస్ట్రియల్ ఏరియా, సూరప్పగూడెం, పాలసానిపల్లి గ్రామాల్లో విద్యుత్ నిలుపుదల ఉంటుందని తెలిపారు. ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.