ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి సభ్యుని ఎన్నిక సందర్భంగా గురువారం భీమడోలు మండలలో గల బూత్ ఇన్‌ఛార్జ్ లు, ముఖ్య నాయకుల సమవేశం భీమడోలు మండల టీడీపీ అధ్యక్షులు శిరిబత్తిన వీరవెంకట సత్యన్నారాయణ అధ్యక్షతన జరిగింది. దీనికి ముఖ్య అతిధిగా రాష్ట్ర టీడీపీ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు సత్యనారాయణ మూర్తి యాదవ్ హాజరయ్యారు. అనంతరం కూటమి అభ్యర్థుల గెలిపించాలన్నారు.