గత ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మనుగా ఉంటూ దోచుకున్న కరుణాకర్ రెడ్డి నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ ఏలూరు జిల్లా టిడిపి అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఈ సందర్భంగా భీమడోలు శనివారం అండ్ మీడియాతో మాట్లాడారు. టీటీడీ గోమరణాలపై భూమన కరుణాకరరెడ్డి అసత్య ప్రచారం మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర చేస్తున్నారని అన్నారు.