భీమడోలు మండలం పొలసానిపల్లి గ్రామంలో ప్లాస్టిక్ వాడకం పూర్తీగా నిషేధించిన సందర్భంగా గ్రామ పరిధిలోని భీమడోలు జంక్షన్ ప్రాంతంలోని వ్యాపారస్తులకు అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రహీమబేగం హసేన, సెక్రటరీ జయ రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. వ్యాపారస్తులు అందరూ గుడ్డతో తయారు చేసిన చేతి సంచులు వినియోగించాలని సూచించారు.