పిఠాపురంలో చిత్రాడ వేదికగా శుక్రవారం జరుగుతున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభకు లక్షలాదిగా తరలి వచ్చే జనసైనికులకి, నాయకులకు, కార్యకర్తలకు భోజనం సదుపాయం కల్పించే ఏర్పాట్లను ఆవిర్భావ సభ ఫుడ్ కమిటీ ఛైర్మన్ ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు శుక్రవారం పరిశీలించారు. వారితో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయి ముఖ్య నాయకులు, సభ నిర్వహణకు సంబంధించిన వివిధ విభాగాల కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.