ఉంగుటూరు మండలంలోని చేబ్రోలు గ్రామపంచాయతీలో సంక్రాంతిని పురస్కరించుకొని పారిశుద్ధ్య కార్మికులకు శుక్రవారం దుస్తులు, నిత్యావసర వస్తువుల కిట్ ను సర్పంచ్ లక్ష్మి సునీత చేతుల మీదుగా బహుకరించారు. ఇందులో దుర్గా భవాని కార్యదర్శి శ్రీనివాస్ వార్డు సభ్యులు రాందే రాజారావు, నగరపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.