ఏలూరు జిల్లా, కైకలూరు మండలంలోని శృంగవరపుపాడు, గోకర్ణపురం గ్రామాల వరద నివాసితులకు నిత్యావసర సరుకులు గురువారం అందించారు. ఈరెండు గ్రామాలు ఇటీవల వరదలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి ఓ దీవిలో జీవిస్తున్నట్లు ఉన్నారు. ఇందులోని పలు కుటుంబాలకు ఉంగుటూరు మండలంలోని నారాయణపురం జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు గొల్లపల్లి రామారావు తన మిత్ర బృందంతో రూ. 30 వేలు విరాళాలు సేకరించి ఇచ్చారు.