గణపవరం మండలంలో జరిగిన ఇంటి దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ వివరాలు వెల్లడించారు. ఈ కేసులో నిందితుడిగా సరిపల్లి రాజు అనే వ్యక్తిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి సుమారు రూ. 23.76 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు రొయ్యల చెరువులో పనిచేస్తూ పేకాట, మద్యం, క్రికెట్ బెట్టింగ్ వంటి దురలవాట్లకు అలవాటుపడ్డాడన్నారు.