గణపవరం: అలర్ట్.. ఆ ఉద్యోగాలకు దరఖాస్తులు

4చూసినవారు
గణపవరం: అలర్ట్.. ఆ ఉద్యోగాలకు దరఖాస్తులు
గణపవరం పరిధిలోని నిరుద్యోగులకు చక్కని అవకాశం లభించింది. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ విభాగంలో అతిథి లెక్చరర్ నియామకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.  ఈ మేరకు ప్రిన్సిపాల్ డాక్టర్ పి. నిర్మలకుమారి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సంబంధిత సబ్జెక్టులో కనీసం 55% మార్కులతో పీజీ, డిగ్రీ, పీహెచ్డీ, నెట్, స్లాట్ అర్హతలున్నవారికి ప్రాధాన్యం ఉందని, దరఖాస్తులు ఈ నెల 14లోపు అందించాలని కోరారు.