గణపవరం మండలం వరదరాజపురం సబ్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ నరసింహమూర్తి తెలిపారు. కొత్త లైన్లు ఏర్పాటు, పాత లైన్లు మరమ్మతుల్లో వెలగపల్లి వరదరాజపురం, అర్ధవరం, వల్లూరు, వాకపల్లి, వీరేశ్వరపురం, ముగ్గళ్ల, కొత్తపల్లి గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు, వినియోగదారులు సహకరించాలని కోరారు.