ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో ఆస్తి కోసం సవతి తల్లిపై హత్యాయత్నానికి పాల్పడిన నాగేశ్వరరావును 24 గంటల్లో అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా బుదవారం రిమాండ్ విధించింది. మృతుడైన మునీశ్వరరావు తన కొడుకు పట్టించుకోపోవడంతో తన తదనంతరం ఆరు ఎకరాల భూమిని రెండో భార్య వెంకటలక్ష్మికి చెందేలా ఆమె పేరుపై రిజిస్ట్రేషన్ చేసి కొన్నేళ్ల తరువాత మృతి చెందాడు. ఆమెపై ఈ నెల 9న రాత్రి కర్రతో దాడి జరిగింది. ఆమె ప్రస్తుతం ఏలూరులో చికిత్స పొందుతోంది.