హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉంగుటూరులో పిల్లలందరూ రకరకాల రంగులు చల్లుకుంటూ హోలీ పాటలు పాడుతూ ఉత్సాహంగా సందడి చేశారు. పెద్దలు కూడా పిల్లలతో పాటు హోలీ పాటలు పాడుతూ ఉత్సాహంగా గడిపారు. వీధులన్నీ రకరకాల రంగులతో పిల్లలతో కళకళలాడాయి. మండలంలో పలు గ్రామాల్లో హోలీ పండుగ ఘనంగా జరిగింది.