ఉంగుటూరు తహసిల్దార్ కార్యాలయం వద్ద జర్నలిస్టుల ఆందోళన

56చూసినవారు
పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన హత్యకు సంబంధించి సాక్షిలో ప్రచురితమైన కథనానికి సాక్షి ఎడిటర్‌ ధనుంజయరెడ్డితో పాటు ఆరుగురు పాత్రికేయులపై క్రిమినల్‌ కేసులు నమోదచేయడాన్ని ఉంగుటూరు మండల ప్రెస్ క్లబ్ ఖండించారు.
జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరుతూ శనివారం డిటి వై పూర్ణచంద్ర ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. తొలుత జర్నలిస్టులు తాహసిల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు.

సంబంధిత పోస్ట్