బడుగు బలహీనవర్గాల అభివృద్ధికి జ్యోతిరావు పూలే విశేష కృషి చేశారని నేటి విద్యార్ధులు ఆయన బాటలో నడవాలని టీడీపీ మండల అధ్యక్షులు ఇందుకూరి రామకృష్ణంరాజు అన్నారు. పిప్పర గ్రామములో మాజీ సర్పంచ్ కొప్పిసెట్టి యేసుబాబు అధ్యర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 199 జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీ నాయకులు కొప్పిసెట్టి యేసుబాబు, బాలాజీ, అన్నవరం పాల్గొన్నారు.