కొత్తగూడెం రహదారి గోతులతో అధ్వానం

68చూసినవారు
కొత్తగూడెం రహదారి గోతులతో అధ్వానం
ఉంగుటూరు మండలం నాచుగుంట శివారు కొత్తగూడెం రోడ్డు గోతులతో ప్రమాదభరితంగా ఉంది. వర్షం వస్తే ఈ రోడ్డు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంటుంది. నిత్యం ఉంగుటూరు నుంచి కొత్తగూడెం, నాచుగుంట, ఎర్రమళ్ళ, గుల్లపాడు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. గోతులతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. నడిచి వెళ్లే ప్రజలు జారి పడిపోతున్నారు. ఈ రోడ్డుకు మరమ్మత్తులు చేయాలని ప్రజలు శనివారం కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్