ఉంగుటూరు మండల వైసీపీ అధ్యక్షులుగా నారాయణపురం గ్రామానికి చెందిన మరడా వెంకట మంగారావు మూడోసారి కూడా పదవి దక్కించుకున్నారు. ఈ సందర్భంగా మంగారావు మాట్లాడుతూ గ్రామస్థాయి నుండి వైసీపీని బలోపేతం చేస్తానన్నారు. ఈ పదవి ఇచ్చిన ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసు బాబుకు మంగారావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.