వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం ఎమ్మెల్యే బొలిశెట్టి

59చూసినవారు
వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం ఎమ్మెల్యే బొలిశెట్టి
ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని, ముందస్తుగా ఇక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. వెలమ సంఘం నాయకులు దాసరి అప్పన్న, కృష్ణవేణి, వెంకటరావు ఆధ్వర్యంలో అర్జున్ హాస్పిటల్ సౌజన్యంతో ఆదివారం పెంటపాడు వెలమ యువజన సంఘ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని ఎమ్మెల్యే శ్రీనివాస్ ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్