స్వాతంత్రం దినోత్సవం సందర్భంగా ఉంగుటూరు గ్రామంలో మూడు చోట్ల ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు గురువారం జాతీయ జెండా ఎగరవేశారు. గ్రామ సెంటర్లో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద, తాహసిల్దార్ , ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎమ్మెల్యే జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.