నిడమర్రు మండలంలో కొత్త విద్యుత్తు తీగలు ఏర్పాటు చేస్తున్నారు. మంగళవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ అంబేడ్కర్ తెలిపారు. పెదనిండ్రకొలను, చిననిండ్రకొలను, నిడమర్రు, గుణపర్రు, విపర్తి ఖండ్రిక, ఆముదాలపల్లి, తోకలపల్లి, చైనేపల్లి, దేవర గోపవరం, అడవికొలను, నిడమర్రు ఇందిరమ్మ కాలనీ తదితర గ్రామాలకు సరఫరా ఉండదన్నారు.