నిడమర్రు మండలం చానమిల్లి గ్రామంలో మంగళవారం టీచర్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. అనంతరం పాఠశాలలోనే ఉపాధ్యాయులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఇటీవల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.