నిడమర్రు మండలం ఏనికెపల్లి గ్రామ శివాలయంలో శనివారం జగదాంబ సమేత సర్వేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు సోదరుడు భీమరాజు స్వామి వారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.