రాబోయే రోజుల్లో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. నిడమర్రు మండలం భువనపల్లి వైసీపీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా వైసీపీ ఉపాధ్యక్షులుగా నియమితులైన పొత్తూరి శ్రీనివాసరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కందులపాటి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వారిని అభినందించారు.