భీమడోలు లైబ్రరీలో వేసవి శిక్షణ కార్యక్రమాల్లో బుధవారం విద్యార్థులు దేశభక్తి గేయాలు ఆలపించి తమ ప్రతిభను చూపించారు. శిక్షణా తరగతుల్లో భాగంగా వారు సామూహిక పుస్తక పఠనం, నీతి కథల వినిపింపు, పుస్తక సమీక్షలు రాయడం చేశారు.రిసోర్స్ పర్సన్స్ టీవీ ఉమామహేశ్వరావు, మండే సుధాకర్లు, గ్రంథపాలకుడు కే శ్రీనివాస్ పాల్గొన్నారు.