విద్యుత్ మరమ్మత్తుల పనుల్లో భాగంగా కొత్త విద్యుత్తు తీగల ఏర్పాటు చేస్తున్నందున శుక్రవారం నిడమర్రు మండలంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా బువ్వనపల్లి, మందలపర్రు, ఎనికేపల్లి, అడవికొలను, సిద్ధాపురం, చానమిల్లి గ్రామాలకు సరఫరా ఉండదని చెప్పారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలన్నారు.