ఉంగుటూరు మండలం 33/11 కేవీ చేబ్రోలు సబ్ స్టేషన్ల పరిధిలో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు ఏలూరు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అంబేడ్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కొత్త 11 కె. వి విద్యుత్తు లైన్ల నిర్మాణం కోసం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.