నారాయణపురం నుండి తల్లాపురం వెళ్లే దండుదారి పుంత రోడ్డును ఆదివారం విస్తరించే పనులు ప్రారంభించారు. గత నెల 15న ఏలూరు కాల్వపై నారాయణపురం బ్రిడ్జి శిథిలావస్థకు చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దాంతో ఈ పుంతదారినే వాడుతున్నారు. వర్షాలతో బురదగా మారిన రోడ్డుపై ఇప్పుడు పెద్ద కంకర రోల్ చేసి మెటల్ రోడ్ వేయనున్నట్టు ఎమ్మెల్యే ధర్మరాజు తెలిపారు.