నారాయణపురం కాలువ గట్టు రోడ్డు నుంచి జాతీయ రహదారి దాకా భారీ వాహనాల రాకను నియంత్రించేందుకు స్థానిక వినాయక గుడి వద్ద ఇనప గెడ్డర్లు శనివారం ఏర్పాటు చేశారు. పంచాయతీ, పాలకవర్గం ఆధ్వర్యంలో, పోలీసుల పర్యవేక్షణలో వీటిని బిగించామని సర్పంచ్ అలకనంద శ్రీనివాస్ తెలిపారు. వంతెన దెబ్బతినకుండా వాహనాలను మళ్లించామని చెప్పారు.