నారాయణపురంలో లయన్స్ క్లబ్‌లో సేవా కార్యక్రమాలు

83చూసినవారు
నారాయణపురంలో లయన్స్ క్లబ్‌లో సేవా కార్యక్రమాలు
నారాయణపురం లయన్స్ క్లబ్ ఆడిటోరియాన్ని జిల్లా లయన్స్ గవర్నర్ కాకరాల వేణుబాబు శనివారం అధికారికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పుసులూరి ప్రకాశరావు నేతృత్వంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి కొత్త వస్త్రాలు పంపిణీ చేశారు. వికలాంగుడు అబ్దుల్ ఖాదిర్‌కు మూడు చెక్రాల సైకిల్ అందజేశారు. అనంతరం గవర్నర్‌ను సభ్యులు సత్కరించారు.

సంబంధిత పోస్ట్