ఉంగుటూరు తాహసిల్దార్ కార్యాలయం వద్ద ఉన్న వేదిక భవనం అసంపూర్తిగా ఉంది. లక్షలాది నిధులతో నిర్మించిన వేదిక భవనం సంవత్సరాలు గడుస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకోవటం లేదు. సభలు సమావేశాలు నిర్వహించడానికి ఏర్పాటు చేసిన భవనం అసంపూర్తిగా ఉండటంతో ఆవరణం పిచ్చి మొక్కలతో నిండిపోయింది. ఇప్పటికైనా అధికారులు వేదిక భవనం పనులు పూర్తి చేయాలిఅని ప్రజలు కోరుతున్నారు.