ఉంగుటూరు నియోజకవర్గంలో పట్టభద్రులు ఓటర్లు లెక్క తేలింది. నాలుగు మండలాలకు సంబంధించి 6,061 మంది ఓటర్లు ఉన్నారు. 2019తో పోల్చుకుంటే ఓటర్లు స్వల్పంగా పెరిగింది. ఉంగుటూరు మండలంలో గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో 1, 218 మంది ఓటర్లు ఉండగా. తాజా జాబితా ప్రకారం 1,627 మంది ఓటర్లు ఉన్నారు. అయిదేళ్లలో 409 మంది మాత్రమే పెరిగారు.