గణపవరం పోలీస్ ఐలాండ్ వద్ద శుక్రవారం కూటమి నాయకులు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, బీజేపీ నాయకురాలు శరణాల మాలతీరాణి పాల్గొన్నారు. భారత్ మాతాకీ జై, త్రివిధ దళాలుకు జై అని నినాదాలు చేశారు. ఈ ర్యాలీ ప్రధాన సెంటర్ నుంచి పోలీసు స్టేషన్ వరకు సాగింది. ర్యాలీలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు పాల్గొన్నారు.