ఏలూరు జిల్లా భీమడోలులో బుధవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. కోమటిగుంట చెరువులో ముగ్గురు మునిగి ప్రాణాలు కోల్పోయారు, మరో ఇద్దరు గల్లంతయ్యారు. చెరువు దగ్గర కాలకృత్యాలకు వెళ్లిన వేళ జారిపడినట్లు తెలుస్తోంది. మృతదేహాలను అగ్నిమాపక సిబ్బంది వెలికితీశారు. ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. గ్రామంలో విషాదం అలుముకుంది.ఇంకా పూర్తి వివరాలు తెలియలసిఉంది.